Breaking News

'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?

Published on Sat, 07/27/2024 - 11:41

హీరో మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ దారుణంగా విమర్శలు చేశాడు. సదరు హీరోకి చెందిన నిర్మాణ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని చెబుతూ ఫుల్ ఫైర్ అయిపోయాడు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. అలా వచ్చే మెయిల్స్‌తో తమకు సంబంధం లేవని, అవన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఏంటి? అసలేం జరుగుతోంది?

(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. ఏమైందంటే?)

మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై ట్రోల్ వీడియోలు చేస్తున్న చాలా యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే వందలాది ఛానెల్స్‌పై స్టైక్స్ వేసి, వాటిని తొలగించారు. ఈ విషయమై తాజాగా ఓ యూట్యూబర్ స్పందించాడు. తనలానే చాలామందికి చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రైక్స్ వేసి, తొలగించారని.. వాటిని తీయమని చెబుతుంటే రాబోయే 'కన్నప్ప' మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫ్రూప్ కూడా చూపించాడు.

దీనిపై ఇప్పుడు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది. పలువురు యూట్యూబర్స్‌కి మెయిల్స్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్‌తో తమకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఓ నోట్ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)