Breaking News

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?

Published on Mon, 12/02/2024 - 17:04

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్‌ బాబు ఫస్ట్ ‍లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్‌ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో  కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)