Breaking News

ప్రభాస్‌ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు

Published on Sun, 06/22/2025 - 08:45

‘‘కన్నప్ప’ సినిమా ఆ భగవంతుని ఆశీస్సులు. మన చేతుల్లో ఏదీ ఉండదు అనడానికి ఉదాహరణే ఈ చిత్రం. రెండు సినిమాలు హిట్‌ అవగానే మనం గొప్పవాళ్లమని అనుకుంటాం. కానీ, మనం కేవలం వస్తువులమే. ఆ భగవంతుడు, తల్లిదండ్రుల ఆశీస్సులే ముందుకు నడిపిస్తాయి’’ అని మంచు మోహన్‌ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా నటించిన  పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్‌  హీరోయిన్‌.. మంచు మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మోహన్‌ బాబు మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో అందరూ హీరోలే. ఈ చిత్రంలో నటించిన నటీనటుల సహాయ, సహకారాలు మరువలేనివి. కన్నప్పగా తిన్నడు ఎలా మారాడు? పరమేశ్వరుడికి కళ్లు ఎలా ఇచ్చాడు? అన్నది ఈ చిత్రకథ. శ్రీ కాళహస్తీశ్వరుడి కరుణ, కటాక్షాలతో ‘కన్నప్ప’ సక్సెస్‌ అవ్వాలి. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  

మంచు విష్ణు(Manchu Vishnu) మాట్లాడుతూ– ‘‘ఇది నా సినిమా కాదు... కన్నప్ప సినిమా. ఎడిటింగ్‌లో సినిమా చూసిననప్పుడు.. ‘వావ్‌.. ఇంత పెద్ద సినిమానా? మేము చేయగలిగామా? నేను నటించానా?’ అనిపించింది. ఈ సినిమాలో చాలామంది హీరోలున్నారు. నటించినవారు, డైరెక్టర్, మ్యూజిక్‌ డైరెక్టర్, ఎడిటర్‌... అందరూ హీరోలే. నేను పని చేసిన బెస్ట్‌ దర్శకుల్లో ముఖేష్‌ కుమార్‌గారు ఒకరు. శివుడి అనుగ్రహం వల్లే ఇంత పెద్ద సినిమా తీయగలిగానని శివ రాజ్‌కుమార్‌గారితో అన్నాను. ‘కన్నప్ప’ సినిమా చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. కానీ, నాన్నగారిపైన ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఒప్పుకున్నారు. కొంచెం డబ్బు, పేరు రాగానే మనుషులు మారిపోతుంటారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పెద్ద నటుల్లో ప్రభాస్‌(Prabhas) ఒకరు... కానీ, మేమిద్దరం కలిసిన మొదటి రోజు నుంచీ ఈరోజు వరకు కూడా అలాగే ఉన్నాం. నా జీవితంలో ప్రభాస్‌ కృష్ణుడు అయితే... తన జీవితంలో నేను కర్ణుడిని. ఈ సినిమాకి ఏది సాధ్యమైంది అన్నా అది నా దేవుడైన నాన్నగారి వల్లే. ‘కన్నప్ప’ని ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’ సినిమాని ఆదరించండి... అభిమానించండి... అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా, ప్రతి గుండెలోకి, ప్రతివాళ్ల మనసులోకి చేరాలి’’ అన్నారు.

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘మోహన్‌ బాబుగారు నన్ను నమ్మడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. తెలుగు భాష కూడా తెలియని నన్ను నమ్మి, టాలీవుడ్‌కి తీసుకురావడం, గొప్ప ప్రాజెక్ట్‌ ఇవ్వడమంటే ఆయన ధైర్యం, నమ్మకమే. నేను పని చేసిన నటుల్లో విష్ణు మంచు మోస్ట్‌ ప్రిపేర్డ్‌ యాక్టర్‌. ప్రభాస్‌గారు మీకు రెబల్‌స్టార్‌. కానీ, నాకు తెలిసి ఆయన హంబుల్‌ స్టార్‌. సింపుల్‌గా ఉంటారు’’ అన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)