Breaking News

కన్నప్ప’ షూటింగ్‌లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!

Published on Sun, 10/29/2023 - 16:05

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’షూటింగ్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డాడని, దీంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారని టాక్ వినిపిస్తోంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ కన్నప్ప స్థాయి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్,  శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, ఆర్టిస్టులు కన్నప్పలో ఉన్నారని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుతున్న కన్నప్ప టీంకి అనుకోని ఘటన ఎదురైంది.

యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో  చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయని సమాచారాం. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. భయపడాల్సినంత పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని సమాచారం.

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)