Breaking News

హాలీవుడ్ నటుడితో మంచు విష్ణు భాగస్వామ్యం

Published on Sat, 12/14/2024 - 13:56

ప్రముఖ హీరో-నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓవైపు కుటుంబ సమస్యలతో సతమవుతున్న ఇతడు.. తరంగ వెంచర్స్ పేరుతో మీడియా-ఎంటర్ టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. 50 మిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టనున్నారు. హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్.. ఇందులో భాగస్వామి అ‍య్యేందుకు సుముఖంగా ఉన్నారని స్వయంగా విష్ణునే బయటపెట్టాడు. త్వరలో శుభవార్త వింటారని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ‍ట్వీట్ వైరల్)

విష్ణు ఆధ్వర్యంలోని తరంగ వెంచర్స్.. ఓటీటీ, యానిమేషన్‌, గేమింగ్‌, బ్లాక్‌ చెయిన్‌, సరికొత్త టెక్నాలజీలైన ఏఆర్‌, వీఆర్‌, ఏఐ వంటి సాంకేతికతకు సంబంధించిన సేవలను అందించనుంది. ఇందులో మంచు విష్ణు, ఆది శ్రీ, ప్రద్యుమన్‌ ఝాలా, వినయ్‌ మహేశ్వరి, విల్‌స్మిత్‌, దేవేష్‌ చావ్లా, సతీష్‌ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారు. వీళ్లతో పాటు మరికొందరు కూడా ఆసక్తి చూపుతున్నారట.

మంచు విష్ణు లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. రాబోయే ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ ఉంటుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీలో విష్ణుతోపాటు మోహన్‌బాబు, శరత్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు. 

(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌