Breaking News

తమ్ముడి పెళ్లిలో గెస్టులా మంచు విష్ణు.. అసలేమైంది?

Published on Sun, 03/05/2023 - 19:27

ఎట్టకేలకు టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌-మౌనికల వివాహం ఘనంగా జరిగింది. ఎంతోకాలంగా స్నేహంగా ఉన్న మనోజ్‌-మౌనికలు తాజాగా పెళ్లిబంధంతో భార్యభర్తలుగా మారారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు..కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చూడముచ్చటైన ఈ జంటకు టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మంచు మోహన్‌ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కొడుకు పెళ్లికి ఆయన హాజరు కారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా వాటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్‌ బాబు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మంచు విష్ణు మాత్రం పెళ్లికి కేవలం అతిథిలా వచ్చి వెళ్లడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

భార్య‌, పిల్ల‌ల‌తో త‌మ్ముడి పెళ్లికి వచ్చిన విష్ణు ఇంటి వ్యక్తిలా కాకుండా కేవలం గెస్టులా కొద్ది సమయం మాత్రమే పెళ్లిలో ఉండి వెంటనే వెళ్లిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు సైతం షాక్‌ అయ్యారు. రీసెంట్‌గా మంచు లక్ష్మీ మనోజ్‌ పెళ్లికి సంబందించిన పలు ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. కానీ ఒక్క ఫోటోలో కూడా విష్ణు కనిపించలేదు. అటు విరానికా, విష్ణు దంపతులు కూడా మనోజ్‌ పెళ్లికి సంబంధించిన ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. దీంతో మంచు వారి  వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)