Breaking News

హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు

Published on Sun, 05/26/2024 - 07:08

బెంగళూరు శివార్లలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్‌ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్‌ షాంపిల్స్‌లో కూడా డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.

బెంగళూరు రేవ్‌ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్‌ పేజీలో ఒక ట్వీట్‌ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు.  ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు.  శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది.  ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు  విజ్ఞప్తి చేశారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)