Breaking News

మంచు విష్ణుకు గాయాలు.. అప్‌డేట్‌ ఇచ్చిన మోహన్‌ బాబు

Published on Wed, 11/01/2023 - 16:54

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్‌ సహా పలువురు స్టార్‌ హీరోలు నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. అయితే రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడ్డట్లు ప్రచారం జరిగింది.

యాక్షన్‌ సన్నివేశాలను డ్రోన్‌ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్‌ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ క్యాన్సిల్‌ అవగా మంచు విష్ణు చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి తండ్రి మోహన్‌ బాబు.. మంచు విష్ణు హెల్త్‌ అప్‌డేట్‌ గురించి ట్వీట్‌ చేశాడు. 'కన్నప్ప షూటింగ్‌లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాడు' అని ట్వీట్‌ చేశాడు.

ఇకపోతే బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ తీసిన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ కన్నప్ప సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శివ భ‌క్తుడైన క‌న్న‌ప్ప క‌థ‌ను ఆధారంగా తీసుకుని తెర‌కెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణు క‌న్న‌ప్ప‌గా క‌నిపించ‌నున్నాడు. ప‌రుచూరి గోపాల‌కృష్ణ, బుర్రా సాయిమాధ‌వ్‌, తోట ప్ర‌సాద్ ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తున్నారు.

చ‌ద‌వండి: ఎనిమిది నెల‌ల గ‌ర్భిణి.. బిడ్డ‌ను చూడ‌కుండానే క‌న్నుమూసిన న‌టి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)