Breaking News

'కన్నప్ప' వేడుకలో ప్రభాస్‌పై మోహన్‌బాబు వ్యాఖ్యలు

Published on Sun, 06/08/2025 - 07:14

విష్ణు మంచు  నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’(kannappa) ప్రీ రిలీజ్‌ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో  ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, ఆర్‌.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, కాజల్‌ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది.

ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రభాస్‌ గురించి నటుడు మోహన్‌బాబు పలు వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్‌, నేనూ 'బావ.. బావ..' అనుకుంటాం. ఇప్పటికీ నేను తనకు ఫోన్‌ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే.. అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్‌. ఈ సినిమాలో నటించాలని నేను అడగ్గానే బావ.. దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా..? మీరు వదిలేయండి. ఏదైనా ఉంటే నేనూ విష్ణు మాట్లాడుకుంటాం..' అని అన్నాడు. దటీజ్‌ ప్రభాస్‌. పెద్దల పట్ల తను చూపించే మర్యాద ఇలా ఉంటుంది.' అని  ఆయన అన్నారు. 

కన్నప్ప సినిమాను  థియేటర్స్‌లో చూసి తన బిడ్డ విష్ణును ఆశీర్వదించాలని ఆయన కోరారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను  స్వయం కృషితోనే పైకొచ్చానని పేర్కొన్నారు. జీవితంలో భయం అనేది  ఉండకూడదని ఆయన సూచించారు.  తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది..? అదే విద్యాలయాల్లో పిల్లలకు  నేర్పిస్తున్నానని అన్నారు. మోహన్‌బాబు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లు ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయ్యారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండమని చెబుతున్నానని తెలిపారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప' సినిమా తీయాలనేది నా కల. ఈ సినిమా కోసం నాకు చాలామంది సహకరించారు. మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను.  ఈ సినిమాలో ఎవరెవరు నటించాలనేది కూడా అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది. ఈ సినిమాలో నా మిత్రుడు ప్రభాస్‌కు (Prabhas) నటించాడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మేము అడిగిన వెంటనే నాన్నగారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ప్రభాస్ వెంటనే ఒప్పుకొన్నాడు. ఈ కాలంలో స్నేహానికి విలువ ఉందంటే ప్రభాస్‌ ఒక ఉదాహరణ అని చెబుతున్నాను. వ్యక్తిగా ఆయన్ను అందరూ ప్రేమించండి.'అని  చెప్పుకొచ్చారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)