Breaking News

మంచు ఫ్యామిలీ వివాదం.. కలెక్టర్‌ ఎదుట హాజరైన మోహన్ బాబు

Published on Mon, 02/03/2025 - 16:16

మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. తాజాగా మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎదుట హాజరయ్యారు. కాగా.. మంచు మనోజ్ తన ఆస్తిలో పాగా వేశారంటూ కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మేజిస్ట్రేట్ హోదాలో వీరిద్దరికీ నోటీసులు జారీ చేయడంతో మోహన్ బాబు కూడా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. ఈ విషయంలో ఇప్పటికే మంచు మనోజ్‌ను అధికారులు విచారించారు.

గతేడాది మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మొదట హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసానికి మనోజ్ వెళ్లగా అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

పరస్పరం ఫిర్యాదులు..

తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్‌ ద్వారా రాచ కొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబుకు ఫిర్యా­దు పంపారు.  తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్‌,  అతని భార్య మౌనికపై చర్యలు తీసు­కో­వాలని కోరారు. 

తిరుపతిలోనూ వివాదం..

ఆ తర్వాత ఇటీవల తిరుపతిలో మరోసారి గొడవ మొదలైంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్‌ను లోపలికి అనుమతించకపోవడంతో గొడవ మళ్లీ పోలీసుల వద్దకు వెళ్లింది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

రంగారెడ్డి కలెక్టరేట్లో మోహన్బాబు, మనోజ్ విచారణ


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)