Breaking News

పెద్దాయనకు తెలియకుండా రౌడీయిజం చేస్తున్నారు: మంచు మనోజ్

Published on Fri, 02/14/2025 - 13:26

మంచువారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మరోసారి వీరి వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. రంగంపేటలోని మోహన్‍ బాబు యూనివర్సిటీ వద్ద ఓ రెస్టారెంట్‌పై దాడి జరగడంతో మంచు మనోజ్ బాధితులకు అండగా నిలిచారు. ఎవరూ కూడా భయపడవద్దని.. మీకు అండగా నేను ఉంటానని మంచు మనోజ్ వారికి భరోసానిచ్చారు. యూనివర్సీటీ దగ్గర్లో ఉన్న రెస్టారెంట్‌పై బౌన్సర్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

మనోజ్ మాట్లాడుతూ..'పెద్దాయనకు తెలియకుండా ఇ‍క్కడ రౌడీయిజం చేస్తున్నారు. నాన్నకు, నాకు గ్యాప్ క్రియేట్ చేశారు. ఇది గత మూడేళ్లుగా జరుగుతోంది. కోట్లు వెచ్చించి, లోన్లు తీసుకుని హాస్టల్స్, హోటల్స్ పెట్టుకుని బతుకుతున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రశ్నించినవారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారు. మీరు ఎవరూ భయపడొద్దు. మీకు అండగా నేను ఉన్నా.' అని హామీ ఇచ్చారు.

అనంతరం మాట్లాడుతూ..' ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టి రావడం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అభాండాలు వేస్తున్నారు. మాట వినకుంటే భార్య, పిల్లలు, తల్లులను టార్గెట్ చేస్తున్నారు. నావైపు నిజం... వాళ్ల వైపు నిజం లేదు. ఇది ఆస్తి గొడవ కాదు.. ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరు చేస్తున్న పోరాటం. తెలంగాణాలో మీడియా, పోలీసులు సహకారంతో బౌన్సర్ల ఆగడాలు కట్టడి చేయగలిగాం. ఇక్కడ కొందరు బౌన్సర్లు మద్యం సేవించి గొడవలు చేస్తున్నారు. అనుభవం ఉన్న వారిని రిటైర్డ్ ఆర్మీ వారిని నియమించుకుంటే బాగుంటుంది. గొడవలు చేసి ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలు లాక్కెళ్లి పోవడం ఆనవాయితీ అయిపోయింది. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు' వెల్లడించారు.

మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)