Breaking News

నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్

Published on Wed, 04/09/2025 - 13:54

మంచు బ్రదర్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది. కూతురు పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం రాజస్థాన్ వెళ్తే.. తన ఇంటికొచ్చి కారు, కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ (Manchu Manoj) పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర బైఠాయించిన మనోజ్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

'మా మ‍ధ్య ఎలాంటి గొడవల్లేవు. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతోనే కూతురు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్ వెళ్లాను. మేం ఇక్కడే ఉండొచ్చని హైకోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయినా ఇంట్లోకి వెళ్లనివ్వట్లేదు. నా తల్లిమీద ప్రమాణం చేసి చెబుతున్నా ఏ రోజు నేను ఆస్తి కోసం గొడవపడలేదు. నేనంటే విష్ణుకి(Manchu Vishnu) కుళ్లు' 

 

'అన్న కెరీర్ కోసం నేను సినిమాలో లేడీ గెటప్ కూడా వేశాను. ఇప్పుడు నా కారుని దొంగతనం చేశాడు. పాప నగలు ఎత్తుకెళ్లాడు. పెద్దవాళ్లని పిలిచి కూర్చుని మాట్లాడుదామని అడుగుతున్నాను. నా 'భైరవం' సినిమాకు భయపడే 'కన్న‍ప్ప' (Kannappa Movie) వాయిదా వేసుకున్నాడు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న గొడవ చూస్తుంటే మరికొన్నిరోజుల పాటు మంచు ఫ్యామిలీ గొడవలు జరుగుతాయా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనోజ్ మీడియాతో మాట్లాడాడు. మరి మోహన్ బాబు-విష్ణు వైపు నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో చూడాలి?

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)