Breaking News

'నా సూర్యుడివి.. నా చంద్రుడివి నువ్వే'.. తండ్రికి మంచు మనోజ్ బర్త్ డే విషెస్

Published on Wed, 03/19/2025 - 15:59

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మోహన్‌ బాబు ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు విషెస్ చెప్పారు. తన తండ్రితో సినిమాల్లో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియోను కూడా పంచుకున్నారు. ఈ వీడియోను 'నా సూర్యుడివి.. చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే' అంటూ యానిమల్ సాంగ్‌తో తండ్రి తన ప్రేమను చాటుకున్నారు.

మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'హ్యాపీ బర్త్ డే నాన్న.. ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మిస్సవుతున్నా.. నీ వెంట నడిచేందుకు ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నా. నీతో ఉన్న ప్రతి క్షణాలను ప్రేమిస్తా నాన్న' అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ చూసిన మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి లైక్‌ కొట్టింది. ఇది చూసిన అభిమానులు తండ్రిపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు. మీరిద్దరు త్వరలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మంచు ఫ్యామిలీలో గొడవలు..

గత కొద్ది నెలలుగా మంచు వారి ఫ్యామిలీలో గొడవలు జరుతుగున్న సంగతి తెలిసిందే. మోహన్‌ బాబు జల్‌పల్లిలోని నివాసం వద్ద మొదలైన ఈ వివాదం.. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు కూడా చేరింది. మంచు విష్ణు- మనోజ్‌కు మధ్య మొదలైన గొడవే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వీరంతా తమ పనులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ  సినిమాను మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)