Breaking News

కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్‌, మౌనిక

Published on Mon, 07/08/2024 - 13:17

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, మౌనిక దంపతులు ఏప్రిల్‌ 13న పండంటి పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ ముద్దల కూతురుకు పేరు పెట్టారు. గతేడాది రెండు కుటుంబాల అంగీకారంతో వివాహబంధంలోకి ఈ జంట అడుగుపెట్టింది. ఈ ఇద్దరికి ఇది రెండో వివాహమే. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తెనే మౌనిక.

తమ ముద్దుల కుమార్తెకు 'దేవసేన శోభా MM' అని మంచు మనోజ్‌ నామకరణం చేశారు. ఆ పేరును సూచించడం వెనుకున్న కారణాన్ని తన ఇన్‌స్టాలో ఇలా వివరించారు. 'మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ 'దేవసేన శోభ MM'ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఎమ్‌ఎమ్‌ పులి అనే తన ముద్దు పేరు ద్వారా అందరికీ బాగా తెలుసు. ఆ పరమేశ్వరుడి భుక్తులమైన మేము.. మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి సతీమణి అయిన 'దేవసేన' పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుంచి 'శోభ' అనే పేరును తీసుకున్నాం. 

వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి. మా జీవితంలో ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు మోహన్‌ బాబు గారు శ్రీమతి నిర్మలా దేవి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచు గారికి నా ధన్యవాదాలు.' అంటూ మనోజ్‌ ఒక లేఖను పంచుకున్నారు. దేవసేన పేరు చాలా బాగుందంటూ నెటిజన్లు తెలుపుతున్నారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)