Breaking News

నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష‍్మీ

Published on Thu, 11/27/2025 - 16:48

కొన్నాళ్ల ముందు వరకు మంచు కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడంతో పాటు పోలీస్ కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ప్రస్తుతానికి అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే వివాదం నడుస్తున్న టైంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష‍్మీ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణమేంటి? కుటుంబంలో గొడవలు కారణంగా తను ఎంత బాధపడ్డాననేది ఇప్పుడు లక్ష‍్మీనే స్వయంగా చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుటుంబ వివాదంపై స్పందించింది.

(ఇదీ చదవండి: కొడుకు సమక్షంలో క్రికెటర్ తో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి)

'దేవుడు కనిపించి వరం కోరుకోమంటే.. నా కుటుంబం అంతా మళ్లీ కలిసిపోవాలని అడుగుతాను. అన్ని ఫ్యామిలీస్‌లోనూ గొడవలు జరుగుతుంటాయి. కానీ ఎన్ని జరిగినా సరే చివరకు అందరూ ఒక్కటైపోవాలి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే.. జీవితాంతం కలవకూడదు అని అనుకుంటారు. కానీ చివరకు మనకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. కుటుంబంతో కలిసి ఉండేందుకు ఎన్ని పోరాటాలైనా చేయాలి. అంతేకాని దూరాన్ని పెంచుకోకూడదు.'

'ముంబైలో నేను ఉంటున్నాను. అయితే ఇక్కడి విషయాలు తెలిసినా బాధపడలేదని కొందరు వార్తలు రాశారు. నేను ఎంత బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. వివాదం గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఇష్టమొచ్చినట్లు నా గురించి రాసేశారు. వాటిపై స్పందించాలని అనుకోలేదు. ఇది నా పర్సనల్ మేటర్. ఇలాంటి వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ చూసిన తర్వాత షాక్ అయ్యాను. మా ఫ్యామిలీ గురించి నేను ఏమనుకుంటున్నానో, ఎంత బాధపడ్డానో బయటకు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది' అని మంచు లక్ష‍్మీ చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: ధర్మేంద్ర మరణం.. తొలిసారి స్పందించిన భార్య హేమమాలిని)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)