Breaking News

తల్లి సమాధి దగ్గర మంచు లక్ష‍్మి.. వీడియో

Published on Tue, 07/22/2025 - 14:07

మంచు మోహన్ బాబు కూతురు లక్ష‍్మి.. మంగళవారం నెల్లూరులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. అలా నాయుడుపేటలోని తల్లి విద్యాదేవి సమాధి దగ్గర నివాళి అర్పించింది. కాస్త భావోద్వేగానికి గురైంది. అదేంటి మంచు లక్ష‍్మి తల్లి చనిపోయిందా? అని మీరనుకోవచ్చు. మోహన్ బాబు తొలుత విద్యాదేవి అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. ఈమెకు పుట్టిన పిల్లలే విష్ణు, లక్ష‍్మి. కొన్నాళ్లకు ఈమె చనిపోవడంతో విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని.. మోహన్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈమెకు మనోజ్ పుట్టాడు. కానీ ముగ్గురూ నిర్మలా దేవికి పుట్టారు అన్నట్లు అన్యోనంగా ఉంటూ వచ్చారు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు స్పందించిన డైరెక్టర్ క్రిష్)

కానీ గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. అన్నదమ్ములైన విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టడం వరకు వెళ్లింది. ఈ విషయంలో మనోజ్ వైపే మంచు లక్ష‍్మి నిలబడింది. గత కొన్నాళ్ల నుంచి మాత్రం అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. తాజాగా నెల్లూరు వచ్చిన మంచు లక్ష‍్మి.. తల్లి సమాధి దగ్గర నివాళి అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గతంలో తెలుగు సినిమాల్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన మంచు లక్ష‍్మి ప్రస్తుతానికైతే కొత్తగా సినిమాలేం చేయట్లేదు. రీసెంట్‌గానే హిందీలో 'ద ట్రైటర్స్' అనే షోలో పాల్గొంది. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తప్పితే కొత్తగా ఈమె చేతిలో ప్రాజెక్టులేం లేనట్లే ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?)

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)