Breaking News

మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌.. ఎవరూ నమ్మొద్దని ట్వీట్!

Published on Thu, 04/17/2025 - 18:25

టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ  సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌ గురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్‌గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 

కాగా.. మంచు లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బిట్‌కాయిస్‌, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన మంచు లక్ష్మీ వెంటనే ట్విటర్‌ ద్వారా అభిమానులను,  సన్నిహితులను అలర్ట్‌ చేస్తూ ట్వీట్ చేసింది. చివరికీ నా మొబైల్ నంబర్ కూడా హ్యాకర్స్ గుర్తించారని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.

కాగా.. మంచు లక్ష్మీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఫ్యాషన్ షో నిర్వహించింది. టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్‌లో పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరైన సందడి చేశారు. ఆమె తమ్ముడు మంచు మనోజ్ సైతం ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికొస్తే మంచు లక్ష్మీ చివరిసారిగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్‌ మాన్‌స్టర్‌లో కనిపించింది. ఇందులో మోహన్‌లాల్, హనీ రోజ్, జానీ ఆంటోనీ, జగపతి బాబు కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీలో కనిపించనుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మహేశ్, వీరేన్ తంబిదొరై కూడా నటించారు. 
 

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)