Breaking News

కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ సలహా

Published on Tue, 02/17/2026 - 19:09

కోలీవుడ్ హీరో విజయ్‌ ఆంటోని అక్క కొడుకు అజయ్‌ దీషన్‌ కథానాయకుడిగా నటించిన లేటేస్ట్ మూవీ బూకీ(తమిళంలో పూకీ). ఈ సినిమాకు గణేశ్‌ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగులో బూకీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌ ఆంటోని నిర్మించడంతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో కూడా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై హీరో అజయ్‌‌ దీషన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. రిలేషన్‌షిప్‌ విషయంలో విజయ్ ఆంటోనీ మీకు ఎలాంటి సలహా ఇచ్చారని హీరోను అడిగింది. రిలేషన్‌షిప్‌లో ఒక ఫ్రెండ్‌గా ఉండమని చెప్పాడని.. ఆ స్నేహం ఒక ఐదేళ్ల పాటు కొనసాగితే అప్పుడు ఆలోచించాలని సలహా ఇచ్చాడని అన్నారు. ఇది విన్న మంచు లక్ష్మీ కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు ‍‍అని సలహా ఇచ్చింది.

అంతేకాకుండా ఈ మూవీ టైటిల్‌ గురించి కూడా మంచు లక్ష్మీ మాట్లాడింది. పూకీ అనే పదం తమిళంలో క్యూటీ అని అర్థమని చెప్పుకొచ్చింది. యంగ్‌స్టర్స్‌ ఎ‍క్కువగా ఈ పదాన్ని వాడతారని తెలిపింది. సినిమాల వల్ల డబ్బులు పొగొట్టుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ స్పందించింది. అవునండి.. అప్పులు అనేవి వందశాతం నిజం.. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు  ఇంకా  కట్టుకుంటున్నానని తెలిపింది. 

కాగా.. ఈ చిత్రంలో ధనుషా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో పాండియరాజన్, సునీల్, ఇందుమతి, మణికంఠన్, వివేక్‌ ప్రసన్న, బ్లాక్‌ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు నటించారు.
 

 

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు