Breaking News

నాకు నాన్న లేరు.. 'చిరు' సార్‌ను చూస్తే ఏడుపొచ్చింది: ఖుషి

Published on Thu, 01/22/2026 - 13:50

చిరంజీవి- అనిల్‌ రావిపూడి మూవీ 'మన శంకరవరప్రసాద్‌గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్లకు పైగానే రాబట్టింది. ఇందులో చిరంజీవి కూతురు నిక్కీ పాత్రలో బాలనటి ఖుషి నటించింది. చిరు కూతురుగా తను చాలా చక్కగా నటించి ప్రశంసలు కూడా అందుకుంటుంది.  నయనతార, చిరు వంటి స్టార్స్‌తో ఖుషి కూడా తన స్థాయికి మించి నటించి మెప్పించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకుంది.

చిరంజీవి కూతురుగా నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఖుషి పేర్కొంది. అయితే, తనకు నాన్నలేరని  తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ, తన తండ్రికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. రాజస్థాన్‌కు చెందిన తమ కుటుంబం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పింది. ఇక్కడే 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపింది. తన మదర్‌ కూడా అదే స్కూల్‌లో పనిచేస్తున్నారని పేర్కొంది.

తనకొక బ్రదర్‌ కూడా ఉన్నాడని తమ సంరక్షణ అమ్మ మాత్రమే చూసుకుంటుందని ఖుషి చెప్పుకొచ్చింది. సినిమా సెట్స్‌లో చిరంజీవి గారిని నాన్న అని పిలిచినప్పుడు చాలా ఎమోషనల్‌ అయ్యేదానినని ఒక్కోసారి కన్నీళ్లు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. తనకు కూడా అలాంటి నాన్న ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయ పడింది. చిరు సార్‌తో చాలా మెమరీస్‌ ఉన్నాయని ఖుషి పంచుకుంది. చిరు సార్‌ను కలిసిన ప్రతిసారి కేక్స్‌, చాక్‌లెట్స్‌ ఇచ్చేవారని తెలిపింది. మెగాస్టార్‌తో గారితో మరో సినిమా ఛాన్స్‌ రావాలని  ఆశపడుతున్నానని కోరుకుంది.  నయనతారతో కూడా మంచి బాండింగ్‌ ఏర్పడిందని ఖుషి చెప్పింది. అయితే, నయన్‌ను అక్క అని పిలుస్తానని, తను చాలా యంగ్‌గా కనిపిస్తారని తెలిపింది. నయన్‌ గారు దుస్తులు కొనిచ్చారని చెబుతూ.. 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా తనకు చాలా ఇచ్చిందని ఖుషి పేర్కొంది. 

Videos

జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం

జార్ఖండ్‌లోని చైబాసాలో భారీ ఎన్ కౌంటర్

Viral Video: నంద్యాల బస్సు ప్రమాదం CCTV వీడియో

YS Jagan: ఏంటి బాబు ఈ పనికిమాలిన పనులు

YS Jagan: నీకు కొడుకు వయసులో ఉన్నా.. నాతో కూడా పోటీ పడలేకపోతున్నావ్

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు బాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్

భూ రీసర్వే పై YS జగన్ రియాక్షన్

YS Jagan: సొమ్మొకరిది.. సోకొకరిది

13 రూపాయల వడ్డీ టైం కి ఇవ్వకపోతే అంతు చూస్తా..!

గుర్తుపెట్టుకో బాబూ.. రేపు మా వాళ్లు నేను ఆపినా ఆగరు!

Photos

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)

+5

కడప : అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం..హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌..తొలి టి20లో భారత్‌ ఘనవిజయం (ఫొటోలు)

+5

అదే మొదటిసారి అంటున్న రుక్మిణి వసంత్‌ (ఫోటోలు)

+5

ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష‍్మీరాయ్ పూజలు (ఫొటోలు)