'మన శంకర వర ప్రసాద్ గారు'.. మూవీలో ఇదొక్కటే మైనస్‌

Published on Mon, 01/12/2026 - 08:51

సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' వచ్చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి పండుగ పరీక్షలో డిస్టింక్షన్ కొట్టేశారు. కామెడీతో పాటు భారీ యాక్షన్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. నిర్మాతలను కమర్షియల్‌గా కూడా గట్టెక్కించే సినిమా అని చెప్పాలి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రీమియర్స్‌లో దుమ్మురేపింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే, ఒక విషయంలో మాత్రం చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.

'మన శంకర వర ప్రసాద్ గారి' గురించి ఎక్కడ చూసిన సానుకూల స్పందన కనిపిస్తుంది.  ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించినప్పటికీ, సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే  ఉపయోగించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మూవీలో  ఈ పాటను చాలాసార్లు ఉపయోగించారు. ప్రధానంగా చిరంజీవి, నయనతార కనిపించిన ప్రధాన సీన్స్‌లలో ఈ సాంగ్‌ ఉంటుంది. 

ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను సినిమాలో చేర్చారా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతలను క్లియర్ చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపీరైట్ విషయాలపై ఇళయరాజా దృఢమైన వైఖరిని తీసుకుంటారని తెలిసిందే. ఇప్పటికే తమిళ హీరోల సినిమాలపై కూడా ఆయన కేసులు వేశారు. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ వియషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్‌ రావడంతో ఈ పాట కారణం వల్ల  థియేటర్ల ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి  చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో చిరు అభిమానులు స్పష్టతను కోరుకుంటున్నారు. నిర్మాతల నుండి ఏదైనా ఒక ప్రకటన వస్తే ఈ  ఊహాగానాలకు చెక్‌ పడుతుంది.

Videos

పండగ లీవ్ కోసం పాట్లు పడ్తున్న రాజేష్

విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్

రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు

సినిమా టిక్కెట్ల వివాదం.. సీఎం Vs మంత్రి.. పవన్ కు ఒకే.. ప్రభాస్ కు నో

కరూర్ తొక్కిసలాట వెనుక కుట్రకోణం

టోల్ ప్లాజా నిర్లక్ష్యం.. ప్రమాదాలకు దారి

గుంటూరు సంక్రాంతి సంబరాల్లో RK రోజా, అంబటి

బోరబండలో యువతీ దారుణ హత్య

వెనుజుల అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన..!

Photos

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)