Breaking News

బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తున్న ‘వరప్రసాద్‌ గారు’.. 3 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..

Published on Thu, 01/15/2026 - 10:49

మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని‘మన శంకరవరప్రసాద్ గారు’తో  మరోసారి నిరూపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకుంది. ఫస్ట్ డేనే వరల్డ్‌వైడ్ గ్రాస్‌గా రూ.84 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండు రోజుల్లోనే సెంచరీ (100 కోట్లు) కొట్టేసింది. మూడో రోజు కూడా కలెక్షన్స్ తగ్గకుండా భారీగా సాగింది. పండగ సీజన్ కావడంతో సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు తరలివెళ్లారు. దీంతో మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.152 కోట్లకు చేరుకుందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.

(మనశంకర వరప్రసాద్‌ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఇటీవల కాలంలో చిరంజీవి సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రాలేదు. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ తన పాత ఫామ్‌ను తిరిగి తెచ్చుకున్నాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది వరుసగా 9వ హిట్. అతని సంక్రాంతి సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయింది. గతంలో సంక్రాంతి సమయంలో విడుదలైన అతని చిత్రాలు అన్నీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ సారి కూడా అదే మ్యాజిక్ పనిచేసింది.

ఈ చిత్రంలో చిరుకి జోడీగా నయనతార నటించగా..క్యాథరిన్‌ కీలక పాత్రలో పోషించింది. ఇక విక్టరీ వెంకటేశ్‌ క్యామియో.. ఈ సినిమాకు మరింత ప్లస్‌ యింది. సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)