Breaking News

25 ఏళ్ల తర్వాత ఇండియాకు.. అందుకోసమే వచ్చానన్న హీరోయిన్‌

Published on Sun, 12/08/2024 - 20:48

సెన్సేషనల్‌ హీరోయిన్‌ మమత కులకర్ణి రెండున్నర దశాబ్దాల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందన్న వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె ముంబైకి తిరిగి రావడంతో ఈ పుకారుకు బీజం పడింది. ఇన్నేళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టినందుకు మమత భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

అందుకోసమైతే రాలేదు
25 ఏళ్ల తర్వాత నా దేశంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్‌, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్‌ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వడానికో, బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకో రాలేదు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేందుకే వచ్చాను అని పేర్కొంది.

డ్రగ్స్‌ కేసులో క్లీన్‌చిట్‌
కాగా మమత కులకర్ణి గతంలో రూ.200 కోట్ల డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో ఇరుక్కుంది. మమత ఏ తప్పూ చేయలేదంటూ బాంబే హైకోర్టు గత ఆగస్టులో క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 2016లో తనపై నమోదైన డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసును కొట్టివేసింది. వక్త్‌ హమారా హై, క్రాంతివీర్‌, సబ్‌సే బడా ఖిలాడి, బాజీ, కరణ్‌ అర్జున్‌, దిల్‌బర్‌, కిస్మత్‌, నజీబ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమశిఖరం, దొంగ పోలీస్‌ చిత్రాల్లో కథానాయికగా నటించింది.

 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)