Breaking News

ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Wed, 03/06/2024 - 11:09

మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మొన్నీమధ్య థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు తిరక్కుండానే సినీ ప్రేమికుల్ని అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో నెటిజన్స్ అలెర్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది?

ఫిబ్రవరిలో మలయాళ ఇండస్ట్రీ వరస హిట్స్ కొట్టింది. ప్రేమలు, భ్రమయుగం, మంజుమల్ బాయ్స్.. ఇలా వారానికొకటి చొప్పున అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. వీటిలో మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' మూవీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో తీసి సాహసం చేశారు. అలానే కేవలం మూడే పాత్రలతో దాదాపు రెండున్నర గంటల సినిమా చూపించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

హారర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా తొలుత మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది జరిగిన వారానికే అంటే ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేశారు. ఇక్కడ ఓ తరహా ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సోని లివ్ ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

'భ్రమయుగం' కథ విషయానికొస్తే.. 17వ శతాబ్దంలో మలబారు తీరం. ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్(అర్జున్ అశోకన్).. అడవిలో తప్పిపోయి కుముదన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటున్న ఇంటికి చేరుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఆశ్రయం పొందుతాడు. అయితే ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా సరే దేవన్ అక్కడి నుంచి బయటపడలేకపోతాడు. చివరకు ఏమైంది? ఇంతకు పొట్టి ఎవరు? అనేది స్టోరీ.

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)