Breaking News

ప్రేమలు బ్యూటీ 'మమితా బైజూ'కు మరో ఛాన్స్‌

Published on Thu, 05/30/2024 - 06:47

ఏ రంగంలోనైనా విజయమే కొలమానం. అది లేకపోతే ప్రతిభ ఉంత ఉన్నా శూన్యమే. అందుకే ఒక్క హిట్‌ కోసం పోరాటం చేస్తుంటారు. అలా మాలీవుడ్‌ యువ నటి మమితా బైజూ కోలీవుడ్‌ దృష్టిని తనపై తిప్పుకుంటోందనే చెప్పాలి. కేరళా కుట్టి తన 15వ ఏటనే నటిగా రంగప్రవేశం చేసింది. అంటే 2017 ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం సర్పోపరి పాలక్కారన్‌. ఆ చిత్రం సక్సెస్‌తో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా ఇటీవల ఆమె నటించిన 'ప్రేమలు' చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ అనువాదం అయ్యి సూపర్‌హిట్‌ అయ్యింది. 

ముఖ్యంగా 22 ఏళ్ల పరువాల బ్యూటీ మమితా బైజూ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈమె పై కోలీవుడ్‌ దృష్టి పడింది. అలా రెబల్‌ చిత్రంతో ఒక్కడ పరిచయం అయ్యింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మమితాబైజూకి అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా మరో లక్కీ ఛాన్స్‌ను ఈ కేరళా కుట్టి కొట్టేసిందని సమాచారం. ఈమె యువ నటుడు , దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్‌ కొట్టిన ప్రదీప్‌ రంగనాధన్, లవ్‌టుడే చిత్రంతో హీరోగానూ రంగప్రవేశం చేసి సూపర్‌హిట్‌ కొట్టారు. 

ప్రస్తుతం ఈయన ఎల్‌ఐసీ, డ్రాగన్‌ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా తదుపరి ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి మమితా బైజూ నటించడానికి ఎంపిక అయినట్లు సమాచారం. దీనికి దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని కోడంబాక్కం వర్గాల సమాచారం.   

Videos

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)