Breaking News

జన నాయగణ్ భారీ ఈవెంట్‌.. మలేసియా పోలీసుల షాక్.!

Published on Wed, 12/24/2025 - 18:19

పాలిటిక్స్ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇదే నా చివరి సినిమా అవుతుందని ప్రకటించారు.  ఈ భారీ యాక్షన్‌ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. సినిమా పొంగల్ బరిలో నిలిచింది.

మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయ్యారు మేకర్స్. నేపథ్యంలోనే గ్రాండ్ఆడియా లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళులు ఎక్కువగా ఉండే మలేసియాలో భారీ ఈవెంట్నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా ఫ్యాన్స్‌ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ 27న జరగనున్న ఈవెంట్ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

అయితే భారీ ఈవెంట్నేపథ్యంలో మలేసియా పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌలాలంపూర్‌లో జరగనున్న బిగ్ఈవెంట్పై ఆంక్షలు విధించారు. కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరించారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనుంది. నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలు చేయవద్దని మలేసియా పోలీసులు సూచించారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతిష్టాత్మక ఈవెంట్ బుకిట్‌ జలీల్‌ స్టేడియంలో జరగనుంది.

కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)