Breaking News

ఓటీటీకి సూపర్ హిట్‌ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Published on Thu, 01/16/2025 - 17:20

ఇటీవల మలయాళ చిత్రాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇతర దక్షిణాది భాషల్లోనూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. గతేడాదిలోనూ మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి చిత్రాలు టాలీవుడ్ ఫ్యాన్స్‌ను మెప్పించిన సంగతి తెలిసిందే.

అలా కొత్త ఏడాదిలోనూ మలయాళ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ రైఫిల్ క్లబ్‌ ఓటీటీకి వచ్చేసింది. ఆశిక్‌ అబు దర్శకత్వం వహించిన గతేడాది డిసెంబర్‌లో మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇంకేందుకు ఆలస్యం యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడేవారు ఎంచక్కా చూసేయండి. 

ఈ చిత్రంలో  విజయ రాఘవన్‌, దిలీశ్‌ పోతన్‌, వాణీ విశ్వనాథ్‌, అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబరు 19న కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్‌ ఉన్ని ముకుందన్ మార్కో, మోహన్ లాల్ నటించిన బరోజ్ 3డీ లాంటి చిత్రాలతో పోటీపడి సూపర్‌ హిట్‌గా నిలిచింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)