Breaking News

మలయాళ సూపర్ స్టార్ బర్త్‌ డే.. జాక్‌ ఫ్రూట్‌తో ప్రేమ చాటుకున్న అభిమాని!

Published on Tue, 05/20/2025 - 18:32

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఆయనపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. ఈనెల 21న మోహన్ లాల్ పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందుగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. జాక్‌ ఫ్రూట్స్‌తో ఆయన చిత్రపటాన్ని రూపొందించాడు.

జాక్ ఫ్రూట్ భాగాలను ఉపయోగించి డా విన్సీ సురేశ్ అనే ఆర్టిస్ట్ మోహన్ లాల్ చిత్రపటాన్ని రూపొందించాడు. దాదాపు 65 రకాల జాక్ ఫ్రూట్‌లతో ఈ చిత్రపటాన్ని తయారు చేశారు.  ఆకుపచ్చ, పసుపు, నారింజ షేడ్స్ లో జాక్ ఫ్రూట్ ఆకులతో మోహన్ లాల్‌ ఫోటోను అలంకరించారు. ఈ చిత్రపటాన్ని త్రిస్సూర్‌ వేలూర్‌లోని ఆయుర్ జాక్ ఫ్రూట్‌ ఫామ్‌లో రూపొందించారు. దాదాపు ఎనిమిది అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తుతో ఈ చిత్రపటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని కోసం దాదాపు ఐదు గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది.

mohanlal

కాగా.. ఈ ఏడాది మోహన్ లాల్ ఎంపురాన్-2  మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా తుడురుమ్ అనే మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాకు సైతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి