Breaking News

మమ్మీ ప్రేమ... భయంతో...

Published on Mon, 03/10/2025 - 03:32

ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘హలో మమ్మీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

హాలీవుడ్‌లో మమ్మీ సినిమాల పరంపర మీకు గుర్తుండే ఉంటుంది. పురాతన కాలంలో గ్రీకు సాంప్రదాయం ప్రకారం సజీవంగా మనుషులను రాతి కట్టడాల్లో పాతి పెట్టడంతో, అందులో చనిపోయిన వారి ఆత్మల రూపంలో తిరిగి వస్తే కథేంటి? అన్నదే హాలీవుడ్‌ మమ్మీల కథా కమామీషు. కాకపోతే ఈ ‘హలో మమ్మీ’ కథ మాత్రం పూర్తిగా వినూత్నం, వైవిధ్యం... మరీ ముఖ్యంగా వినోదాత్మకం. ఇదో హారర్‌ కామెడీ. వైశాఖ్‌ ఎలాన్స్ ఈ సినిమాకి దర్శకుడు.

ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ మలయాళ సినిమా నిడివి రెండున్నర గంటలు. చూసినంతసేపు ఈ సినిమా ఓ పక్క కాస్త భయపెడుతూనే మరో పక్క గిలిగింతలు పెడుతుంటుంది. షరీఫ్, ఐశ్వర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా ఆద్యంతం వినోదభరితమనే చెప్పాలి. అంతలా ఏముందో ఈ సినిమా కథను ఓసారి తెలుసుకుందాం. స్టెఫీని బోనీ ప్రేమిస్తాడు. స్టెఫీ తన తండ్రి శామ్యూల్‌తో ఉంటుంది. స్టెఫీ తల్లి 20 ఏళ్ల క్రిందటే చనిపోతుంది.

కానీ ఈ 20 ఏళ్లు స్టెఫీని ఆ తల్లి ఆత్మ రూపంలో అంటిపెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే స్టెఫీ అంటే తల్లికి చాలా ఇష్టం. స్టెఫీ మీద ఈగ కూడా వాలనీయదు. అలాగే ఇంట్లో ఆత్మ రూపంలోనే బోలెడన్ని రూల్స్‌ పెడుతుంది. స్టెఫీ తల్లి ఆత్మ విషయం ఈ ప్రపంచంలో స్టెఫీకి, ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియదు.

బోనీని స్టెఫీ ఇష్టపడినపుడు తన తల్లి విషయాన్ని బోనీకి చెబుతుంది. కానీ బోనీ వినిపించుకోడు. పెళ్లై స్టెఫీ ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాత స్టెఫీ తల్లి ఆత్మ పరిచయమవుతుంది అతనికి. దాంతో బోనీ ఖంగు తింటాడు. ఇక అక్కడ నుండి కథ ఎలా మలుపులు తిరుగుతుందో ప్రైమ్‌ వీడియో ఓటిటీలోనే చూడాలి. కొన్ని కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని మిస్‌ చేసుకోకూడదు. వర్త్‌ఫుల్‌ వాచ్‌... ఇంకెందుకు ఆలస్యం... ‘హలో మమ్మీ’ని పలకరించండి... భయంతో కాదు... ప్రేమతో... – ఇంటూరు హరికృష్ణ

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)