Breaking News

ఓటీటీలో సూపర్‌ హిట్‌ హారర్‌ సినిమా.. ఎక్కడంటే?

Published on Thu, 09/18/2025 - 16:46

ఓటీటీలో మలయాళ సినిమాలకున్న క్రేజే వేరు. అయితే ఈసారి లవ్‌స్టోరీకి బదులుగా ఓ కామెడీ హారర్‌ మూవీ ఓటీటీ (OTT)లోకి రానుంది. ఆ సినిమాయే సుమతి వలవు (Sumathi Valavu Movie). ఇందులో అర్జున్‌ అశోకన్‌, సైజు కురుప్‌, గోకుల్‌ సురేశ్‌, మాళవిక మనోజ్‌, బాలు వర్గీస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు శశి శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్‌ కామెడీ చిత్రం దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.

ఓటీటీలో హారర్‌ మూవీ
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 26 నుంచి జీ5లో ప్రసారం కానుందని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సుమతి వలవు అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో హారర్‌, కామెడీతో పాటు మిస్టరీ, ఎమోషన్స్‌, థ్రిల్‌ కూడా ఉందని చిత్రయూనిట్‌ చెప్తోంది. ఐఎమ్‌డీబీలో ఈ సినిమా 7.7 రేటింగ్‌ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్‌ కూడా ప్రకటించారు.

 

చదవండి: అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)