ఓటీటీలో 'ఇసుక మాఫియా' హిట్‌ సినిమా స్ట్రీమింగ్‌

Published on Sat, 01/04/2025 - 09:51

మలయాళ నటుడు హకీమ్ షాజహాన్ నటించిన 'కడకన్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన  రివెంజ్ డ్రామాగా ఈ సినిమా భారీ హిట్‌ అందుకుంది. గతేడాది మార్చిలో విడుదలైన ఈ మూవీ సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఈ చిత్రం మలయాళంలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్‌ ఉంది.

మ‌ల‌యాళంలో తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన కడకన్‌ మంచి విజయాన్ని అందుకుంది. అయితే, సడెన్‌గా స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇసుక మాఫియాలో జరిగే సంఘటనలను తెరపై డైరెక్ట‌ర్ సాజిల్ మాంపాడ్ అద్భుతంగా తీశాడు. అతనికి మొదటి సినిమా ఇదే అయినప్పటికీ దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. మంజుమ్మెల్ బాయ్స్, అన్వేషిప్పిమ్ కండేతుమ్ వంటి భారీ హిట్‌ సినిమాల‌ను తట్టుకుని కడకన్‌ మంచి కలెక్షన్స్‌ రాబట్టింది.

ఇసుక మాఫియా వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ప్రతీకార ఘటనలను తెరపై దర్శకుడు చూపించాడు. ఇండియాలోనే నాణ్యమైన ఇసుక కేరళలోని మ‌ల్ల‌పురం ఏరియాలో దొరుకుతుంది. అక్కడ ఇసుక మాఫియా వల్ల జరిగిన కొన్న నేరాల నుంచి స్ఫూర్తి పొందుతూ.. స్నేహం, ప్రేమ‌, యాక్ష‌న్ అంశాల‌ను వాటికి జోడించి కడకన్‌ చిత్రాన్ని తెర‌కెక్కించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)