Breaking News

పదేళ్ల తర్వాత స్టార్‌హీరోకు భారీ హిట్‌.. ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్‌

Published on Fri, 01/02/2026 - 13:24

మలయాళ సినిమా 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ నటించిన తాజా  చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మలయాళం భారీ కలెక్షన్స్‌ వైపు దూసుకుపోతుంది. ఏకంగా పదేళ్ల తర్వాత నటుడు నివిన్ పౌలీకి భారీ హిట్‌ దక్కింది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు. ఓటీటీ సమయంలో తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది.

ఈ ఏడాదిలో కొత్త లోక చిత్రం మలయాళం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్‌ దాటింది. 2025 సినిమా కలెక్షన్స్‌ లిస్ట్‌లో టాప్‌లో ఈ చిత్రం ఉంది. అయితే, ఏడాది ముగింపులో విడుదలైన సర్వం మాయ సినిమా కూడా ఇప్పడు జోరు చూపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రూ. 76 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. అయితే, సులువుగా రూ. 150 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

‘సర్వం మాయ’ కథ రొమాంటిక్ కామెడీ-డ్రామాకు కాస్త హారర్ జోడించడం ఆపై ఫాంటసీని కూడా కలపడంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ విజయంలో నివిన్ పాలీ నటన కీలకమైతే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రియా శిబూ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో  ఆకర్షించింది. ఇందులో ఆమె నటనపై రివ్యూవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  రియా శిబూకి సినీ రంగంతో బలమైన అనుబంధం ఉంది. ఆమె నిర్మాతగా కూడా రాణిస్తుంది. గతంలో హీరోయిన్‌గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వీర ధీర శూరన్‌ చిత్రాన్ని నిర్మించిన రియా కోలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని పంపిణీ చేసింది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)