Breaking News

యువ నటికి ప్రముఖ డైరెక్టర్‌ లైంగిక వేధింపులు..!

Published on Wed, 04/01/2026 - 09:27

ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత రంజిత్‌ బాలకృష్ణన్‌ అరెస్టు అయ్యారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు ‍అదుపులోకి తీసుకున్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇడుక్కిలో రంజిత్‌ బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకుని.. అనంతరం కొచ్చి పోలీసులకు అప్పగించారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనను అరెస్ట్‌ చేశారు.

ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఒక సినిమా సెట్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యువ నటి ఫిర్యాదులో పేర్కొంది.  సినిమా చిత్రీకరణ సమయంలో రంజిత్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని నటి తన ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడానికి ముందే.. బాధితురాలు సినిమా నిర్మాణ సంస్థలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC)కి అధికారికంగా కంప్లైంట్ చేశారు. కమిటీ విచారణ అనంతరం ఈ కేసును కేరళ పోలీసులకు అప్పగించింది. అయితే నటి  వివరాలు గోప్యంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతంలోనూ రంజిత్‌పై ఆరోపణలు..

కాగా.. గతంలో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర చేసిన వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. 2024లో రంజిత్ కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై కావాలనే కొందరు టార్గెట్‌గా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మరో నటి ఫిర్యాదుతో ఆయనను అరెస్ట్‌ చేయడంతో ఈ టాపిక్ మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

 

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)