హీరోయిన్‌పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!

Published on Fri, 03/01/2024 - 18:38

ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మలయాళంలో‌ హిట్‌ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్‌ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు.

(ఇది చదవండి: డైరెక్టర్‌ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్‌)

అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్‌’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్‌మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్‌ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది.

కాగా..  వణంగాన్‌ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్‌ విజయ్‌ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్‌, సముద్రఖని, మిస్కిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)