Breaking News

'నటితో అసభ్య ప్రవర్తన.. ఎయిర్‌పోర్ట్ అధికారులపై తీరుపై ఆగ్రహం'

Published on Wed, 10/11/2023 - 11:59

ప్రస్తుత కాలంతో మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు సైతం బాధితులవుతున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి కొచ్చిన్ వెళ్తుండగా తన పక్కనే ఉన్న ప్రయాణికుడు వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 10న మంగళవారం జరగ్గా.. తాజాగా నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.

(ఇది చదవండి: ‘ఇండియన్‌ 3’​కి కమల్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. 30 రోజుల్లో షూటింగ్‌ పూర్తి!)

ఇన్‌స్టాలో దివ్య ప్రభ రాస్తూ.. 'ప్రియమైన మిత్రులారా.. నేను ముంబయి నుంచి కొచ్చికి ఎయిరిండియా ఫ్లైట్‌లో వచ్చా. ఈ ప్రయాణంలో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఫ్లైట్‌లో తోటి ప్రయాణీకుడు తాగిన మత్తులో నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌కు చెబితే.. టేకాఫ్‌కు ముందు నా సీటును మాత్రమే మార్చారు. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత సమస్యను ఎయిర్‌పోర్ట్ అధికారులకు వివరించాను. వారు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు సహాయ పోస్ట్‌కు వెళ్లమని సలహా మాత్రమే ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశా. ప్రయాణీకుల భద్రత  ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకుందాం. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిద్దాం. ఈ విషయంలో మీ సపోర్ట్ కావాలి' అంటూ పోస్ట్ చేసింది.

(ఇది చదవండి: 'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్! )

ఈ వేధింపులకు సంబంధించి కంప్లైంట్‌తో పాటు ఎయిరిండియా ప్లైట్ టికెట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని.. అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్‌పోర్ట్ అధికారులను కోరారు. ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బంది, అధికారుల స్పందన తనను నిరాశకు గురిచేసిందని దివ్య ప్రస్తావించారు. అయితే ఎయిర్‌పోర్ట్ అధికారుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు ఇంకా  ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ దివ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. మలయాళ నటి అన్నా బెన్  దివ్యకు మద్దతుగా పోస్ట్ చేశారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి