Breaking News

దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన

Published on Tue, 02/11/2025 - 17:02

దసరా మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు.  అయితే తాజాగా ఆయనకు ఓ కేసులో ఊరట లభించింది. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతనితో పాటు మరో ఆరుగురిని కొచ్చిలోని అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు.  సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు కొకైన్ సేవించినట్లు సరైనా ఆధారాలు లేవంటూ నటుడు చాకో సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరితో పాటు ఓ నైజీరియన్‌, తమిళనాడుకు చెందిన పృథ్వీరాజ్‌ అనే వ్యక్తి కూడా ఉన్నారు.  జనవరి 30, 2015న కొచ్చిలోని కడవంత్రాలోని ఒక ఫ్లాట్‌లో కొకైన్ సేవించారని షైన్ టామ్ చాకోతో పాటు నలుగురు మహిళా మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత  2015 మార్చిలో బెయిల్‌ పొందిన తర్వాత అందరూ జైలు నుంచి బయటకు వచ్చారు.

కాగా..  నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాలో  చిన్ననంబిగా విలనిజంతో మెప్పించారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా పాత్రలు దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన టాలీవుడ్‌ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య డాకు మహారాజ్‌లో కూడా నటించారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలతో బిజీగా ఉన్నారు.
రు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు