Breaking News

తెలుగు హీరోయిన్లపై రాజాసాబ్‌ బ్యూటీ విమర్శలు

Published on Wed, 01/21/2026 - 19:26

మలయాళ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌.. మలయాళంతోపాటు సమానంగా తమిళంలోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో తను నటించిన మాస్టర్‌, పేట, తంగలాన్‌ చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్‌ ది రాజాసాబ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్‌ 2 మూవీలో యాక్ట్‌ చేస్తోంది.

డైలాగులు బేఖాతరు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. చాలాకాలం కిందట సంగతి ఇది. తెలుగు, తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారే కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టేవారు. అంతే..! ఆవేశం, కోపం కలగలిపిన సీన్లలో ఏబీసీడీ అనే అక్షరాలను చదువుతూ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేవారు. 

మమ అనిపించేవారు
ఏబీసీడీ అన్న అక్షరాలను పదేపదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. ఆ లిప్‌ సింక్‌ వల్ల డబ్బింగ్‌లో చెప్పే డైలాగ్స్‌కు సరిగ్గా సరిపోయేవి. కెరీర్‌ మొత్తం వాళ్లిలాగే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. మాస్టర్‌ మూవీలో నిన్ను ట్రోల్‌ చేసిందెందుకో మర్చిపోయావా? అని మరికొందరు మాళవికపై సెటైర్లు వేస్తున్నారు.

 

 

చదవండి: మమ్ముట్టి సినిమాలు రిజెక్ట్‌ చేశా..: హీరోయిన్‌ భావన

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)