Breaking News

ఆ క్రెడిట్‌ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్‌

Published on Sat, 10/05/2024 - 06:46

కోలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సినిమా పరిశ్రమలో హీరోల ఆదిపత్యమే ఎక్కువగా ఉంటుందని చాలామంది హీరోయిన్‌లు లేవనెత్తారు. తాజాగా నటి మాళవిక మోహన్‌ ఇదే గోడును వ్యక్తం చేశారు. ఈ కేరళ బ్యూటీ కోలీవుడ్‌లో పేట చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఆ చిత్రంలో శశికుమార్‌కు భార్యగా నటించి  గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఈమెకు నటుడు విజయ్‌ హీరోగా నటించిన 'మాస్టర్'‌ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వరించింది. అందులో ఈమె పాత్ర పరిధి తక్కువే అయినా చిత్రం హిట్‌ కావడంతో అందులో తానూ భాగం పంచుకున్నారు. 

ఆ తరువాత ధనుష్‌కు జంటగా నటించిన 'మారన్‌' తదితర చిత్రాల్లో నటించారు. తాజాగా విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన 'తంగలాన్‌' చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటుడు కార్తీకి జంటగా 'సర్దార్‌–2' చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో ప్రభాస్‌కు జంటగా 'ది రాజాసాబ్‌' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో మాళవిక మోహన్‌ పాన్‌ ఇండియా నటిగా ముద్ర వేసుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె ఒక భేటీలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితిని ఏకరువు పెట్టారు. 

ఆమె మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ప్రాముఖ్యతనివ్వడం లేదనన్నారు. ఒక చిత్రం వసూళ్ల పరంగానూ విమర్శల పరంగానూ మంచి విజయాన్ని సాధిస్తే ఆ క్రేడిట్‌ అవార్డులు హీరోలే పొందుతున్నారన్నారు. హీరోయిన్లు మాత్రం ఎక్కువగా గుర్తింపు రావడం లేదని వాపోయారు. అదే చిత్రం అపజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్‌ దురదృష్టవంతురాలు అని ముద్ర వేస్తున్నారన్నారు. ఈ పరిస్థితి దక్షిణాదిలో మాత్రమే కాదని, ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ తాను చూస్తున్నానని, ఇదే పెద్ద సమస్య అని నటి ఆమె పేర్కొన్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)