Breaking News

ఛాన్సుల కోసమే అలాంటి పని చేయడం లేదు: నటి

Published on Mon, 06/02/2025 - 14:47

వెండితెరపై గ్లామర్‌గా నటించడం తప్పా అని చాలా మంది కథానాయికలు ప్రశ్నించారనే విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ నటి 'మాళవిక మీనన్‌'(Malavika Menon) కూడా అదే అడుగుతోంది. తమిళ, మలయాళ చిత్రాల్లో ఈ కేరళా కుట్టికి భారీగానే అభిమానులు ఉన్నారు. దీంతో మాతృభాషలో నటిస్తూనే కోలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తెలుగులో కూడా 'అమ్మాయిలు అంటే అదో రకం, వందనం' అనే రెండు చిత్రాలతో తన లక్‌ను చూసుకుంది. కానీ, ఇక్కడ అనుకున్నంతగా ఛాన్సులు రాలేదు. కానీ, మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఈసారి గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ అమ్మడు తమిళంలో ఇవన్‌ వేర మాదిరి, విళా, బ్రహ్మన్‌, వెత్తువెట్టు, నిజమానిళలా వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అయితే ఈ బ్యూటీ చిత్రాలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ కుర్రక్రారును ఆకట్టుకుంటుంది. దీంతో చిత్రాల్లో పక్కింటి అమ్మాయిగా కనిపించే మాళవిక మీనన్‌ గ్లామర్‌గా మారడానికి కారణం అవకాశాల కోసమా? అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారని పేర్కొంది. అయితే అలాంటిదేమీ లేదని చెప్పింది. 

అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేంటి అని ప్రశ్నించింది. మలయాళ చిత్రాల్లో గ్లామర్‌గా నటించే అవకాశం ఉండదని, తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో అలా నటించవచ్చునని పేర్కొంది. అయినా సామాజిక మాధ్యమాల్లో తన గ్లామరస్‌ ఫొటోల గురించి అడుగుతున్నారని, తాను మాత్రమే అలా చేస్తున్నానా అని ప్రశ్నించింది. అయినా ఫేక్‌ అకౌంట్లతో అవాస్తవాలు రాస్తూ ముఖం చూపడానికి భయపడే వారు సామాజిక మాధ్యమాల్లో తన గురించి ఉన్నవి, లేనివి ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదనే అభిప్రాయాన్ని మాళవిక వ్యక్తం చేసింది.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)