Breaking News

మొదట ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడొద్దు.. అమ్మ సలహా!

Published on Thu, 12/04/2025 - 14:01

కెవ్వు కేక, చయ్యచయ్య చయ్యా, మున్నీ బద్నాం హూయి.. వంటి పాటలతో దుమ్ములేపింది మలైకా అరోరా. ఆకర్షణీయమైన అందం, అదిరే స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇటీవలే థామా సినిమాలోనూ 'పాయిజన్‌ బేబీ' పాటలో తళుక్కుమని మెరిసింది. ఐటం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చూసింది.

పెళ్లి - విడాకులు
ఓ కాఫీ యాడ్‌ షూట్‌లో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ను కలిసింది మలైకా. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వెంటనే మరేం ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2015లో వీరిద్దరూ విడిపోయారు. 

యంగ్‌ హీరోతో డేటింగ్‌
అనంతరం తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్‌ చేసిన వీరు ఆ తర్వాత సడన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హర్ష్‌ మెహతా అనే వ్యాపారితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి ఇచ్చిన సలహాను ఎలా పెడచెవిన పెట్టిందో చెప్పుకొచ్చింది. 

డేట్‌ చేసినవాడితో పెళ్లెందుకు?
ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయమని చెప్తుండేది. ఫస్ట్‌ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చింది. కానీ, నేనదే చేశాను. నేను ప్రేమించిన మొదటి వ్యక్తినే పెళ్లాడాను. నా నిర్ణయాన్ని అమ్మ తప్పుపట్టింది. అప్పుడే  పెళ్లి చేసుకుంటే నీకోసం బయట ఏం దాగి ఉందో నీకెలా తెలుస్తుంది? అని కంగారుపడింది. ఏం కాదమ్మా.. అని సర్ది చెప్పాను. మేం ఏం చేయాలనుకున్నా సరే తనెన్నడూ అడ్డు చెప్పలేదు.

మగవాళ్లను తప్పుపట్టరు
కానీ ఈ ప్రపంచంలో మగవాడు ఏం చేయాలనుకున్నా ఎవరూ తప్పుపట్టరు. విడాకులు తీసుకున్నా.. తన వయసులో సగం ఏజ్‌ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే.. వావ్‌ అని పొగుడుతారు. అదే పని మహిళ చేస్తే మాత్రం ఆమెను నానామాటలంటారు. అంతెందుకు? ఆడవాళ్లు ధైర్యంగా నిలబడి ముందుకెళ్తుంటే కూడా చూసి ఓర్వలేరు అని మలైకా అరోరా (Malaika Arora) చెప్పుకొచ్చింది.

చదవండి: టికెట్‌ టు ఫినాలే గెలిచేదెవరు?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)