Breaking News

కొత్త బిజినెస్‌ మొదలుపెట్టిన మలైకా అరోరా

Published on Thu, 11/28/2024 - 19:32

బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా కొత్త రెస్టారెంట్‌ ప్రారంభించింది. కుమారుడు అర్హాన్‌ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ రెస్టారెంట్‌ బిజినెస్‌ గురించి వెల్లడించింది. తన చిన్ననాటి స్నేహితుడు మలయ నాగ్‌పాల్‌, రెస్టారెంట్‌ నడిపే ధవల్‌ ఉదేషితో కలిసి ఈ ఫుడ్‌ బిజినెస్‌లో దిగింది. ముంబైలోని బాంద్రాలో కొలువుదీరిన ఈ రెస్టారెంట్‌కు స్కార్‌లెట్‌ హౌస్‌ అని నామకరణం చేశారు.

మలైకా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌
90 ఏళ్ల క్రితం నాటి పోర్చుగీస్‌ ఇంటికి వింటేజ్‌ లుక్‌ తీసుకొచ్చి రెస్టారెంట్‌గా మార్చేశారు. ఈ న్యూస్‌ వినగానే అభిమానులు, సెలబ్రిటీలు మలైకా అరోరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అక్కడికి వచ్చి భోజనం రుచి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. మలైకా సోదరి అమృత అరోరా.. నా డార్లింగ్‌ సిస్టర్‌.. మొత్తానికి నీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను అమల్లో పెట్టేశావు అంటూ ప్రశంసలు కురిపించింది.

ఏదైనా వంటకం నచ్చిందంటే వదిలిపెట్టం
తన కుమారుడితో కలిసి రెస్టారెంట్‌ను ప్రమోట్‌ చేయడానికి గల కారణాన్ని మలైకా చెప్తూ.. మా ఇద్దరికీ భోజనం అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఫుడ్‌ ఆస్వాదిస్తాం. విదేశీ టూర్‌లో ఏదైనా వంటకం నచ్చిందంటే కచ్చితంగా దాన్ని ఇంట్లో ట్రై చేస్తాం.. కాబట్టి రెస్టారెంట్‌ ప్రారంభించడమనేది నా మనసుకు నచ్చిన పని చేస్తున్నట్లుగా ఉంది అని పేర్కొంది.

 

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)