Breaking News

ముఖం నిండా గాయాలు.. అయినా షూట్‌ చేద్దామన్నా: బాలీవుడ్ నటి

Published on Tue, 10/01/2024 - 21:30

బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ మహిమా చౌదరి. ప్రస్తుతం ఆమె సిగ్నేచర్‌ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ దిల్ క్యా కరే మూవీ షూటింగ్‌లో ఎదురైన సంఘటనను పంచుకుంది. అది తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. తన ముఖానికి ఎంత గాయాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పింది. అయినప్పటికీ షూట్ కొనసాగించాలని చెప్పానని.. కానీ దర్శకుడు ప్రకాష్ ఝా విశ్రాంతి తీసుకోమని చెప్పారని వివరించింది.

మహిమా చౌదరి మాట్లాడుతూ.. 'షూటింగ్‌ సమయంలో నాకు నా ప్రమాదం జరిగింది. నా ముఖంపై ఇన్ని గాయాలు ఉన్నాయని నేను గ్రహించలేదు. తర్వాత బాత్‌రూమ్‌కి వెళ్లి అద్దంలో చూసుకున్నా. ఏమీ జరగకపోతే షూట్ చేద్దాం అని ప్రకాష్ జీకి చెప్పాను. కానీ ఆయన వద్దన్నారు.  గాయం తర్వాత నా ముఖం నుంచి డాక్టర్లు 67 గాజు ముక్కలు బయటకు తీశారు. ఆ సమయంలో ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అజయ్ దేవగన్, ప్రకాష్ జాను కోరా. నా కెరీర్ కాపాడుకునేందుకు బయట పెట్టొద్దని వారిని అభ్యర్థించాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపెట్టానని చెప్పుకొచ్చింది' బాలీవుడ్ భామ. అంతేకాకుండా తన కంటికి సర్జరీ తర్వాత చాలా ఒత్తిడికి గురైనట్లు మహిమా చౌదరి వెల్లడించింది. శస్త్రచికిత్సల తర్వాత ఇప్పటికీ నా కన్ను ఒకటి చిన్నదిగా కనిపిస్తుందని వివరించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)