Breaking News

బుల్లితెర నటి ఐవీఎఫ్‌.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..

Published on Thu, 07/27/2023 - 12:11

పెళ్లయిన ప్రతి దంపతులకు ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? లేదా ఎంతమంది పిల్లలు? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోని దంపతులు లేరంటే అతిశయోక్తి కాదు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ తిప్పలు తప్పవు. బుల్లితెర స్టార్స్‌ మహి విజ్‌-జై భానుశాలి కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. పిల్లల్ని ఎప్పుడు ప్లాన్‌ చేస్తున్నారు? అన్న ప్రశ్న వారికీ ఎదురైంది. ఒకరకంగా చెప్పాలంటే వారు కూడా సంతానం కోసం ఎంతో ఎదురుచూశారు. కానీ పిల్లలు కావాలన్న వారి కోరిక ఫలించలేదు.

సంతానం కోసం ఐవీఎఫ్‌
దీంతో 2019లో ఐవీఎఫ్‌(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఎంచుకున్నారు. ఈ విధానం ద్వారా మహి గర్భంలో కవలలను ప్రవేశపెట్టారు. తమ సంతోషం రెట్టింపు కానుందని సంబరపడేలోపే వారి ఆనందం ఆవిరైంది. ఒక పాపాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మరో పాప మాత్రం ఆరోగ్యంగా జన్మించింది. తాజాగా ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకుంది మహి విజ్‌.

నాలుగో ప్రయత్నంలో సక్సెస్‌
ఆమె మాట్లాడుతూ.. 'సంతానం కోసం ఐవీఎఫ్‌ పద్ధతిని ఎంచుకున్నాం. తొలి ప్రయత్నం విజయవంతం కాలేదు. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగో ప్రయత్నంలో విజయవంతమైంది. ఈ గుడ్‌న్యూస్‌ నాకు ముందుగా నా భర్త చెప్పాడు. అప్పటికే నేను పూర్తిగా బెడ్‌ రెస్ట్‌లో ఉన్నాను. సోనోగ్రఫీ కోసం మాత్రమే బయటకు వెళ్లేదాన్ని. మిగతా సమయాల్లో నర్సే ఇంటికి వచ్చి ఇంజక్షన్స్‌ ఇచ్చేది. నేను అప్పుడు చాలా సైలెంట్‌ అయిపోయాను. బయట ప్రపంచంతో సంబంధాన్ని కట్‌ చేసుకున్నాను.

కవలల్లో ఒకరు కన్నుమూత
ఐవీఎఫ్‌ వల్ల కవలలు పుట్టడానికి ఎక్కువ ఛాన్స్‌ ఉంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఒక పాప ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఒకరకంగా మంచే జరిగిందన్నారు. చాలా సందర్భాల్లో కవలల్లో ఒకరు చనిపోయేలా ఉంటే మిగతా ఒకరు కూడా మరణించే అవకాశాలే ఎక్కువన్నారు. కానీ మిగతా పాపకు ఏం కాకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. కనీసం ఒక్కరైనా మాకు దక్కారని సంతోషించాం' అని చెప్పుకొచ్చింది. కాగా మహి-జై 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు 2019లో తారాకు జన్మనిచ్చారు.

చదవండి: విజయ్‌ దేవరకొండ షర్ట్‌తో కనిపించిన రష్మిక.. మళ్లీ దొరికిపోయిందిగా
ఈ శుక్రవారం ఓటీటీలో 22 సినిమాలు

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)