Breaking News

రిలీజ్‌కి ముందే మహేశ్ 'గుంటూరు కారం' సినిమా రికార్డ్

Published on Sat, 01/06/2024 - 10:28

సూపర్‌స్టార్ మహేశ్ బాబు దాదాపు ఏడాదిన్నర తర్వాత థియేటర్లలోకి రాబోతున్నాడు. మాస్ ఎలిమెంట్స్‌తో తీసిన 'గుంటూరు కారం'.. జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఓవైపు హంగామా నడుస్తుంటే.. మరోవైపు కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మహేశ్ ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

మహేశ్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో అందరి దృష్టి 'గుంటూరు కారం' పైనే ఉంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో అది కూడా మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో రిలీజ్ విషయం వేరే లెవల్‌లో ప్లాన్ చేశారు.

(ఇదీ చదవండి: మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?)

అమెరికాలో 5408కి పైగా ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ విషయంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్-3800కి పైగా, సలార్-2450కి పైగా షోలు వేశారు. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే.. తెలుగు మూవీకి ఈ రేంజు ప్రీమియర్ షోలు అంటే సరికొత్త రికార్డే. దీనిబట్టి చూస్తుంటే విడుదలకు ముందే హాఫ్ మిలియన్ డాలర్స్.. ముందస్తు బుకింగ్స్ రూపంలో వచ్చేసినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో 5-6 మిలియన్ డాలర్స్ వసూళ్లు రావడం గ్యారంటీ అనిపిస్తోంది.

జనవరి 12న థియేటర్లలోకి వచ్చే 'గుంటూరు కారం'లో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని తల్లి సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసినట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందించాడు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'హను-మాన్' అదే రోజు రిలీజ్ కానుండటం విశేషం.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)