Breaking News

ఎట్టకేలకు ‘వారణాసి’ అప్‌డేట్‌.. అసలైన బ్లాస్ట్‌ ఎప్పుడంటే?

Published on Mon, 11/16/2026 - 17:19

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. వీరిద్దరి కలయికలో వస్తోన్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అప్పుడెప్పుడో టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఓ వీడియో విడుదల చేసిన రాజమౌళి ఇప్పటి వరకు మరో అప్‌డేట్‌ అనే మాటేలేకుండా ఉన్నారు. దీంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఎక్స్‌ వేదికగా
ఈ నేపథ్యంలో చిత్రబృందం ఎక్స్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టింది. ‘‘వారణాసి’ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సీజీఐ, రీ రికార్డింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.డబ్బింగ్‌ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఇదే అప్‌డేట్‌ అనుకోండి. లేదంటే అసలైన బ్లాస్ట్‌ కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడండి’ అంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే సినిమా విడుదలకు దగ్గర పడతుండడంతో వచ్చే జనవరి లోపల బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   

ఏప్రిల్‌ 7న
కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: ఆ రోజు తండ్రికి కొడుకే పోటీ.. నెగ్గేదెవరో..?)

 

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)