Breaking News

మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది...

Published on Mon, 08/09/2021 - 17:06

SSMB28 Update : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను వెల్లడించింది చిత్ర బృందం. ఇప్పటివరకు ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా ఎవరు నటిస్తారన్న సస్పెన్స్‌ను తెరదించుతూ బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనౌన్స్‌ చేసింది. ఇక హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.

‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో  వస్తున్న మూడో చిత్రం ఇది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మహేశ్‌బాబు పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మహేశ్‌-త్రివిక్రమ్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)