ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
Breaking News
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్
Published on Wed, 03/25/2026 - 12:59
రాజమౌళి ఏ సినిమా తీసినా కాస్త రహస్యంగానే ఉంచుతాడు. బాహుబలి కావొచ్చు, ఆర్ఆర్ఆర్ కావొచ్చు.. జక్కన్న అనుకున్నప్పుడే ఏ చిన్న విషయమైనా బయటకొచ్చేది. అలాంటిది మహేశ్ బాబుతో తీస్తున్న 'వారణాసి' కోసం ఇంతకు ముందులా కాదు చాలా మారిపోయినట్లే కనిపిస్తున్నాడు. ఎందుకంటే మూవీ రిలీజ్‌కి ఏడాదిన్నర ముందే టీజర్ లాంటిది రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఇప్పుడు మూవీ సెట్స్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్)
సాధారణంగా చిత్రీకరణ ఫొటోలు, సెట్ ఫొటోలు గానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండే రాజమౌళి.. గతేడాది నవంబరులో మూవీ టీజర్/గ్లింప్స్ రిలీజ్ కోసం ఏకంగా హాలీవుడ్ మీడియాలోని కొందరిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఆ సమయంలో తానే స్వయంగా వాళ్లని 'వారణాసి' షూటింగ్ లొకేషన్స్‌కి తీసుకుని వెళ్లాడు. అప్పుడు వాళ్లు సెట్స్‌కి సంబంధించిన వీడియోలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
వారణాసి వీధులు, ఘాట్స్ తదితర సెట్స్ ఇందులో చూపించారు. మినీయేచర్ సెట్ వీడియో కూడా ఇందులో చూడొచ్చు. ఇకపోతే రెండు నెలల క్రితం హాలీవుడ్‌కి చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్స్‌కి మూవీ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు రిలీజ్ చేశారు. సాధారణంగా ఇలాంటివి.. సినిమా రిలీజ్ టైంలో ప్లాన్ చేస్తుంటారు. కానీ రాజమౌళి ఏడాదిన్నర ముందు నుంచి ఇలాంటివి ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. చూస్తుంటే ఈసారి హాలీవుడ్‌లోనూ గట్టిగా పాగా వేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి?
గ్లోబ్‌ట్రాటర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న 'వారణాసి'లో రుద్ర అనే పాత్రలో మహేశ్ కనిపించబోతున్నాడు. మందాకిని అనే పాత్ర ప్రియాంక చోప్రా చేస్తుండగా, కుంభ అనే ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా మూవీని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: ప్రభాస్‌తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి)
Tags : 1