Breaking News

Guntur Kaaram Collection Day 1: రచ్చ లేపిన గుంటూరు కారం.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Sat, 01/13/2024 - 14:36

మాస్‌ యాంగిల్‌లో దుమ్ములేపాడు మహేశ్‌బాబు. గుంటూరు కారం సినిమాలో తన యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్‌ బిర్యానీ తినిపించాడు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాసే అక్కడక్కడా తడబడ్డట్లు కనిపించింది. అయితే పాటలు, ట్రైలర్‌ బాగా క్లిక్‌ అవ్వడంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓ రేంజులో జరిగాయి. దీంతో సంక్రాంతి పందెంలో దిగిన గుంటూరు కారం తొలి రోజు బీభత్సంగా రాబట్టింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌డే రూ.94 కోట్లు రాబట్టింది.

కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్స్‌ అందుకున్నాడంటూ చిత్రయూనిట్‌ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు జై బాబు, రికార్డ్స్‌ బ్రేకింగ్‌ రమణ అంటూ సంతోషంతో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్‌, సునీల్‌, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతమందించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించారు.

సంక్రాంతి బరిలో విజయం సాధించేనా?
ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి పోటీగా హనుమాన్‌, సైంధవ్‌ రంగంలోకి దిగాయి. వీటిలో హనుమాన్‌ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20 కోట్ల మేర రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ మౌత్‌ టాక్‌ వల్ల హనుమాన్‌ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. రేపు(జనవరి 14న) ఈ మూడు సినిమాలకు పోటీగా నా సామిరంగ రిలీజ్‌ కానుంది. బాక్సాఫీస్‌ వద్ద జరిగే ఫైట్‌లో ఈ నాలుగింటిలో ఏది విజేతగా నిలుస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది!

చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే?
 అప్పుడు శోభన్‌ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి