Breaking News

'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' ఆల్‌టైమ్‌ రికార్డ్‌ .. కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Sat, 08/02/2025 - 13:50

'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' యానిమేటెడ్‌ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది. ఎలాంటి తారాగణం లేకుండానే విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్‌లను క్రియేట్‌ చేసింది. కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఏకంగా ఇండియన్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. 'మ‌హావ‌తార్' సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా జులై 25న విడుదలైన ఈ చిత్రం చాలాచోట్ల థియేటర్స్‌ కూడా హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. బుక్‌మైషోలో ఏకంగా ప్రతిరోజు రెండు లక్షలకు పైగా టికెట్లు తెగుతున్నాయి. క్లీమ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్ర‌ఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. తెలుగులో గీతా అర్ట్స్‌ నుంచి అల్లు అరవింద్‌ విడుదల చేశారు.

దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన 'మహావతార్ నరసింహ' సినిమాను చూసేందుకు పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తున్నారు. దీంతో 8రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 60.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మార్కెట్‌లో విడుదలైన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులను మహావతార్‌ దాటేసింది. ఇండస్ట్రీలో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్‌లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించింది. ఏకంగా వన్‌ మిలియన్‌ క్లబ్‌లో కూడా చేరింది. ప్రపంవ్యాప్తంగా అన్ని భాషలలో ఇప్పటికీ అదే స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇది డివైన్ బ్లాక్‌బస్టర్‌ అని చిత్ర మేకర్స్‌ పేర్కొన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)