Breaking News

'ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌'కు మహాత్మా గాంధీ మునిమనవడు ప్రశంసలు

Published on Tue, 11/26/2024 - 07:38

చారిత్రాత్మక స్వాతంత్య్రపోరాట నేపధ్యంలో తీసిన 'ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌' సోనీలివ్‌ వేదికగా ఓటీటీ వీక్షకుల ఆదరణ చూరగొంటోంది.  దర్శకుడు నిక్కిల్‌ అద్వానీ విజన్‌ ప్రేక్షకులతో పాటు ప్రముఖుల  ప్రశంసలను కూడా అందుకుంటోంది. తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ ఈ సిరీస్‌ను చూడాల్సిందిగా సిఫారసు చేయడం విశేషం. 

ఆయన ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారిలా... ’ఫ్రీడం ఎట్‌ మిడ్‌నైట్‌’ చూడటం మొదలుపెట్టాను. ఇది బాపు – పండిట్‌ నెహ్రూ – మన ఫ్రీడమ్‌కు సంబంధించిన ఒక హిందూత్వ వెర్షన్‌ అని నేను అనుకున్నాను. కానీ నేను పొరపడ్డాను. ఇది ముందస్తు అంచనాలు ఉండవద్దనే పాఠం నాకు నేర్పింది.   దీని గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది. అయతే తప్పక దీన్ని చూడాల్సిందిగా నేను  సిఫార్సు చేస్తున్నాను’’ తుషార్‌ గాంధీ మాత్రమే కాకుండా ఆలోచింపజేసే చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు  సుధీర్‌ మిశ్రా కూడా ఈ సిరీస్‌కు సంబంధించి దర్శకుని కృషిని  ఎంతగానో ప్రశంసించారు.   

లారీ కాలిన్స్, డొమినిక్‌ లాపియర్‌ రాసిన పుస్తకం ఆధారంగా ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌ రూపొందింది.  ఇందులో సిధాంత్‌ గుప్తా, చిరాగ్‌ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్‌ జకారియా, మలిష్కా మెండోన్సా, రాజేష్‌ కుమార్, కేసీ శంకర్, ల్యూక్‌ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా, అలిస్టెయిర్‌ ఫిన్లే, ఆండ్రూ కల్లమ్,  రిచర్డ్‌ టెవర్సన్‌ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో నెక్ట్స్‌తో కలిసి ఎమ్మే ఎంటర్‌టైన్‌ మెంట్‌ (మోనిషా అద్వానీ – మధు భోజ్వానీ) దీన్ని నిర్మించింది. ఈ సిరీస్‌కు నిఖిల్‌ అద్వానీ దర్శకత్వం వహించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)