Breaking News

'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!

Published on Tue, 07/29/2025 - 13:14

ప్రస్తుతం దర్శక నిర్మాతలందరూ పాన్ ఇండియా సినిమాలు వెంటపడుతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుధ్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ వైపే చూస్తున్నారు. దాదాపు వీళ్లలో ఎవరో ఒకరు కావాలని పట్టుబడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో తీస్తున్న ఓ పాన్ ఇండియా మూవీ కోసం మణిశర్మ కొడుక్కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా?

టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. అప్పట్లో చిరంజీవి, మహేశ్ బాబుతో పాటు స్టార్ హీరోల సినిమాలకు ఈయన మ్యూజిక్ ఇచ్చారు. కానీ ట్రెండ్ మారడంతో ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి. మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ కూడా మ్యూజిక్ డైరెక్టరే. 2015 నుంచి ఆడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తున్నారు. ఛలో, భీష్మ చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అలా చిరంజీవితో 'భోళా శంకర్'కి మ్యూజిక్ ఇచ్చే అవకాశం దక్కింది.

(ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్‌కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్)

కానీ 'భోళా..' పాటలు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ పెద్దగా ఇంప్రెసివ్‌గా లేకపోవడం, మూవీ కూడా ఫ్లాప్ కావడంతో మహతికి తర్వాత పెద్ద ప్రాజెక్టులేం రాలేదు. అలాంటిది ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కోసం మహతి స్వరసాగర్‌ని తీసుకున్నారనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ త్వరలో దీనిపై క్లారిటీ రావొచ్చు. ఓ రకంగా చూస్తే మహతికి ఇది గోల్డెన్ ఛాన్సే. తన సంగీతంతో మెప్పిస్తే మాత్రం మంచి గుర్తింపు గ్యారంటీ.

పూరీ-సేతుపతి ప్రాజెక్ట్ విషయానికొస్తే ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. సంయుక్త హీరోయిన్‌గా చేస్తోంది. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిల్యూర్స్‌తో డీలా పడిన పూరీ జగన్నాథ్.. వీలైనంత వేగంగా సేతుపతి మూవీని పూర్తి చేసి డైరెక్టర్‪‌గా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అలానే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)